నాలో రేగే ఆలోచనలు

ఆనందంగా జీవించటం అంటే

ఆనందంగా జీవించటం అంటే ఆనందంగా జీవించడం అంతే…
ఆ మాత్రం చెప్పడానికి టపా ఎందుకు ?

అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది.
ఎక్కడొ చదివాను మనిషి ఆనందంగా జీవించాలంటే

కనీస మానవ అవసరాలు తీరుతూ ఉండాలి
చేయటానికి ఎదొ ఒక పని ఉండాలి,
సాధించడానికి ఎదొ ఒక లక్ష్యం ఉండాలి.

నేను ఇదేదొ బాగానే ఉందే అనుకున్నాను.

కాని పై వన్ని కలిగి ఉన్న వ్యక్తులు కూడా ఆనందంగా లేరు అంటే???
పై న చెప్పిన సిద్దాతం లో ఎదొ పొరపాటు ఉంది.

ఈ మద్యన నేను ఒక మిత్రుడుతో మాట్లాడుతున్నప్పుడు ఇదే సంభాషణ వచ్చింది.
నీవు జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తున్నావా అని నేను అడిగాను, తను వెంటనే  లేదు  మరి నువ్వు అని అన్నాడు. నేను బాగానే ఆనందిస్తున్నాను అన్నాను. నీకు ఇళ్లు కోనాలని ఉంది అని చెప్పావు కదా అన్నాడు. అవును అని చెప్పాను. మరి ఇప్పుడు ఆనందంగా బతుకుతున్నాను అని అంటావేంటి?
నేను మళ్లి ఆలోచనలలో పడ్డాను. మళ్లి తనే చెప్పాడు నీ విషయం వదిలేయ్యి. కొరికలు తీరని వారు, లక్ష్యాలను సాదించలేని వారు ఆనందంగా ఏల జీవిస్తారు అన్నాడు. వారి ఆనందం వారి విజయాలలోనే ఉంది కదా అన్నాడు అప్పటికి నా వద్ద ఎమి సమాధానం లేదు. చర్చ  అక్కడితో ముగిసింది కాని నాలో నడుస్తూనే ఉంది.

నాకు ఎంత ఆలొచించిన కూడ మన లక్ష్యానికి  మన ఆనందానికి సంబంధం ఎంటో ఆర్థం కాలేదు.
పోని ఈ రెండింటికి ఎదైన లింక్ ఉంటే
ఆనందంగా జీవిస్తూ ఉన్న వ్యక్తు లు కింది వర్గాలలో ఉండాలి

1) వారి లక్ష్యాలను సాధించి, ఇంకా ఎటువంటి లక్ష్యాలు లేక విశ్రాంతి తీసుకుంటున్నవారు 
2) ఎలాగూ లక్ష్యాన్ని సాధించలేమని వదిలేసిన వారు

పై వర్గాల మధ్య పెద్ద తేడా ఎమి లేదు (ఇద్దరికి ఎమి లక్ష్యం లేదు)   కాబట్టి  లక్ష్యం లేని వారు మాత్రమే ఆనందంగా జీవిస్తారని అనుకుంటే 100% తప్పు.
ఇంకొ వర్గం కూడ ఉంది, ఈ లక్ష్యాలు చింతకాయలు ఎంట్రా బాబు, జీవితం ఏలా పొతే అలానే వెలదాం అనుకునే వారు  వీరు జీవితంలో ఎటు వెళతారో వదిలేస్తే వీరు జీవితాన్ని బాగానే ఆనందిస్తారు (కనీసం అలా అనుకుంటారు).

మొత్తానికి నాకు మాత్రం లక్ష్యానికి ఆనందంగా జీవించదానికి ఎమి సంబందం లేదు అనిపించింది.

ప్రతి రొజు ని ఆనందించండి..
మనం ప్రతి రొజు ఆఫీస్ కు ఎందుకు వెలుతున్నాము? జ్ణ్గాన పరిశోధన కోసం,దేశ సేవ కోసం మాత్రమే (కేవలం వీటి కోసమే వెళ్లే వారు)వెళ్లే వారిని వదిలెయ్యండి. డబ్బులు కూడ ఒక ముఖ్య కారణం కదా. డబ్బులు దేనికి? ఇలా ప్రశ్నిస్తూ పోతే అన్ని చేసేది ఆనందంగా ఉండటం కోసం అని వస్తుంది.(మీకు వేరే సమాధానం దొరికితే నాకు కూడ చెప్పండి)

కాబట్టి రేపు ఆనందంగా ఉండటం కొసం (ఉద్యొగం ద్వారా), ఈ రొజు ఆనందంగా ఉండటం మరిచిపోకండి.

ఎక్కడొ మొదలుపెట్టి  ఏంటొ చెప్పి ఎక్కడొ ఆపాడు అని అనిపిస్తే, ఒక సారి నవ్వుకొని ఈ టపా ను పక్కన పెట్టేయండి.  

Note : పైన రాసిందంతా కేవలం నా పైత్యం మాత్రమే, నిజాల శాతం తెలియదు, రిఫరెన్సులు ఎమి లేవు.

30/06/2007 - Posted by | నా పైత్యం

6 వ్యాఖ్యలు »

  1. Your analysis and conclusion are both interesting.
    Well, make it the principle of your life. Good luck.

    వ్యాఖ్య ద్వారా lalithag | 30/06/2007 | స్పందించండి

  2. ఈ టపా చాలా ఆసక్తికరంగా ఉంది కానీ అడుగడుగునా అక్షరదోషాలు ఇబ్బందిపెట్టాయండీ. కానీ మంచి విషయం ప్రస్తావించారు అప్పుడప్పుడూ ఇలాంటి చక్కని సలహాలు ఇస్తూంటే నాబోటి వారు రేపటి రోజును కాసింతైనా ఆనందంగా గడపటానికి నేటి నుంచే ప్రయత్నాలు మొదలుపెడతాం మరి.

    వ్యాఖ్య ద్వారా sarath | 30/06/2007 | స్పందించండి

  3. “కాబట్టి రేపు ఆనందంగా ఉండటం కొసం (ఉద్యొగం ద్వారా), ఈ రొజు ఆనందంగా ఉండటం మరిచిపోకండి.” బాగా చెప్పారు.
    కాని ఉద్యోగం లేని నాలాంటి వాళ్ళ కోసమో ? 🙂
    అటు నిరుద్యోగులు కాని ఇటు ఉద్యోగులూ కాని రచయితలు, చిత్రకారులు, వివిధ కళాకారులు, వ్యాపారాశయాలు ఉన్నవారు, వగైరా ల కోసం ఎం సలహాలు లేవా ? 🙂
    డబ్బునుండి ఆనందం వస్తుందంటే, వారి అమాయకత్వానికి జోహార్లు.

    వ్యాఖ్య ద్వారా రాకేశ్ | 01/07/2007 | స్పందించండి

  4. @raakesh gaaru,
    i am on a blog holidays..:-))
    i will respond you soon.

    వ్యాఖ్య ద్వారా రాజేష్ గన్నారపు | 08/07/2007 | స్పందించండి

  5. Anandam akkada?

    వ్యాఖ్య ద్వారా s.gopalakishanrao | 07/05/2008 | స్పందించండి

  6. very good message

    వ్యాఖ్య ద్వారా venu | 18/09/2012 | స్పందించండి


వ్యాఖ్యానించండి