నాలో రేగే ఆలోచనలు


ఆడువారి ….
జూన్ 11, 2007, 9:27 pm
ప్రచురించిన వర్గము సరదాగా

ఆడువారి మాటలకు అర్ధాలె వేరులె ఆడువారి మాటలకు అర్ధాలె వేరులె
అర్ధాలె వేరులె అర్ధాలె వేరులె అర్ధాలె వేరులె అర్ధాలె వేరులె

అలిగి తొలగి నిలిచినచో
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె
చొరవ చేసి రమ్మనుచో
చొరవ చేసి రమ్మనుచో మరియాదగ పొమ్మనిలె

పై పాట లిరిక్స్ ఈ లింక్ లొ నుండి వాడబడినవి

ఆనాడు ఎన్.టి.ఆర్  మళ్లి ఈనాడు పవన్  ఒకే మాటచెపుతున్నారు. కాని  నిజంగా ఆడవారి మాటలకు అర్ధాలు వేరా? ఎమొ మరి,నాకు అలా ఎమి అనిపించటం లేదు. ఒకటి మాత్రం నిజం, చీ = ఇష్టం అని దగ్గరికి వెళితే దవడ పగిలేది ఖాయం.  

ఇలా నాలో నీనే తర్కించుకుంటే ఎమి లాభం, పెద్దలను అడుగుదామని మీముందుకు వచ్చా…
కాస్త ఆ నిజం ఎమిటొ చెప్పి పుణ్యం కట్టుకోండి బాబు…..



ఇలా చేసి చూడండి
మే 30, 2007, 9:46 pm
ప్రచురించిన వర్గము జనరల్ - అబిప్రాయాలు

కాగితం, కలం తెచ్చుకోండి (లేక పోతే నోట్ పాడో, వర్డ్ పాడో తెరవండి) .

ముందుగా మీరు అమితంగా ద్వేషించే వ్యక్తి కి చిట్ట చివరి ఉత్తరం రాయండి.

బాగా ఆలోచించి నెమ్మదిగా రాయండి. రాయటం పూర్తి ఐన తర్వాత మరో సారి సరిచూసుకోండి.

మీరు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత, ఆ లేఖ ను పక్కన పెట్టండి.

ఇప్పుడు మీరు అత్యంత ఇస్టపడే వ్యక్తి కి మీ చిట్ట చివరి ఉత్తరం రాయండి.

మీరు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత, మీరు ముందు రాసిన లేఖ ను ఇప్పటి లేఖ తొ పోల్చి చూడండి.

ఆశ్చర్యంగా రెండు లేఖ లొ మాటలు ఒకే విదంగా ఉంటాయి.



ఫిన్ లాండ్ లొ అవీ ఇవీ
మే 22, 2007, 7:41 pm
ప్రచురించిన వర్గము జనరల్ - అబిప్రాయాలు

మనకు ఫిన్ లాండ్ కు మధ్య కొట్టొచ్చినట్టు కొన్ని తేడాలు కనిపిస్తాయి.

ముందుగా వాతావరణం గురించి  చూద్దాం. ఇది ఒక శీతల దేశం. ఈ దేశాన్ని సరస్సుల దేశం అంటారు, కాని ఆ సరస్సులన్ని ఎప్పుడు గడ్డ కట్టి ఉంటాయి:-).అంటే వేసవి కాలం లొ కాదు అనుకోండి.

నీను దక్షిణ ప్రాంతము లో ఉండటం మూలాన నాకు Arctic Circle అనుభవం లాంటివి దక్కలేదు. ఇక్కడ సుదీర్ఘమైన పగల్లు రాత్రులను చూడవచ్చు. నీను ఇక్కడకు వచ్చిన అక్టోబర్ మాసం లొ కనుచూపు మేరా మంచు కనపడేది, దానితొ పాటు వెలుగు ఉండేది కాని సూర్యుడు జాడ మాత్రం కనిపించేదే కాదు. కేవలం గడియారం మీద ఆదారపడవలసి వచ్చేది. రోజు  రోడ్లపై, ఫుట్ పాత్ ల పై  ఒక రకమైన ఇసుక చల్లుతారు తద్వార ప్రయాణం సులభమవుతుంది. డిసెంబర్/జనవరి మాసాలలో మనం చక్కగా నదులపై నడుచు కుంటూ వెళ్లి పొవచ్చు. ప్రస్తుతం ఇక్కడ వేసవి కాలం రాబోతుంది. ఇప్పుడు రహదారులన్ని పచ్చని రంగు ని సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు ఎప్పుడు చూసినా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ఫిన్ లాండ్ లోని కొన్ని ప్రదేశాలలో 24 గంటలు సూర్యుడు ఉంటాడు.

ఇక్కడి ప్రజలు స్నేహ స్వభావులు, నీను ఇక్కడి కి వచ్చిన రోజు మొదటగా బస్సు లోనుండి దిగే ముందు, ఆ బస్సు డ్రైవర్ బస్సు దిగి నేలను చూపుతూ “this..  not earth all ice ” అని చెప్పాడు, నీను వెంటనె ” thank you” అన్నాను. దానికి వెంటనే “mita (=what)” అన్నాడు . నాకు ఎమి అర్థం కాలేదు. సరే Finnish నేర్చుకోని “thank you ” అని చెపుదామని  నా బసకు వెళ్లి పొయాను.



చెలిమి
మే 17, 2007, 5:48 am
ప్రచురించిన వర్గము మా అన్నయ్య కవితలు

వెతికాను చెలిమి కోరకు,
పోలేను చెలియ వరకు,
అపార్థాల దరి చేరకు,
అవగాహన చేజార్చకు,
అనర్థాలు చేకూర్చకు….

కలిమి కోరకు చేయి జాపి,
చెలిమి నీకు అందజూపి,
లేని పోని యన్ని తలచి,
మచ్చతేను నేస్తానికి …..

మౌనమేల నీలొ నేస్తమా,
నీ ఆలోచనలలోనే లోపమా,
చెలిమి కోరుట నేరమా,
అవగాహన లో అవరోధమా….

కోరాను సన్నిహితము,
ఆశించను సాంగత్యము,
ప్రేమ కెన్ని బాదలున్న,
లేవు కదా అవి చెలిమికి….

గలగల మాటాడే నిన్ను చూసి,
స్నేహన్ని కోరితే,
అపార్థాల దరి చేరి ,
దూరమయ్యావు ఆనాడు,
నా తప్పే అనుకుంటే ఐ యాం వెరి సారీ !



హితుడా - స్నేహితుడా
మే 16, 2007, 7:00 pm
ప్రచురించిన వర్గము మా అన్నయ్య కవితలు

అడగని సాయానికి ఆదుకొన్న,
చెప్పని బాధను తెలుసుకొన్న,
కదలని మనసు ను కరిగించిన,
కరిగిన గతాన్ని మరపించిన,
హితుడా - స్నేహితుడా,
అదుపు లేని ఆలోచనలకు ఆనకట్ట వేసి,
నీకు నీనున్నానని నా తోడు నిలిచావు,
కష్టాల కడలి ఎదురైతే మరువకు నేనున్నానని,
సమస్య ల వలయం లొ అలసితే, నా చెంత చేరి సేద తీరు,
మరువకు ఈ మిత్రున్ని, విడువకు ఈ స్నేహన్ని!!!!!!