నాలో రేగే ఆలోచనలు

మంచి – చెడు

కృత యుగం లో మంచి ఒక లొకం లో చెడు మరొక లొకం లో ఉండేవట…  (దేవ లొకం – రాక్షష లొకం)

త్రేతా యుగం లో మంచి సముద్రాని కి ఇవతల చెడు సముద్రాని కి అవతల ఉండేవట… (అయోద్య – లంక)

ద్వాపర యుగం లొ మంచి, చెడు పక్క పక్క నె ఉండేవట… (పాండవులు – కౌరవులు)

కలి యుగం లొ మంచి, చెడు ఒకే మనిషి లొ ఉంటయట… (మనుషులు)

ఎక్కడొ చదివా, బాగుంది కదా… :-)

01/08/2009 రాసినది రాజేష్ గన్నారపు | జనరల్ - అబిప్రాయాలు | | No Comments Yet

ఇంటర్యు-ఇంటిపేరు

నా మిత్రుడు ఈ మద్య ఒక ఇంటర్యు కి వెళ్లాడు, అంతా బాగానే చెప్పనని వాడు సంబరపడి పొతున్న దశలో…

ప్ర: మీ విభాగపు పెద్ద తలకాయ (Head of Depertment) పేరు ఎమిటి?
సమా:రామారావు గారు
ప్ర: పూర్తి పేరు చెప్పండి?
సమా: ఇంటిపేరు తెలియదండి.
ప్ర: మీరు చేసిన ప్రాజెక్ట్ (తెలుగు సమానార్ఠం తెలియదు)గురువు (Guide) పేరు ఎమిటి?
సమా:సుబ్బారావు గారు
ప్ర: పూర్తి పేరు చెప్పండి?
సమా: ఇంటిపేరు తెలియదండి.
ప్ర: ఇంటిపేరు పేరు తెలియకుండా ఎలా ఉంటుందండి?
సమా: మీము అక్కడ (India) ఇంటిపేర్లు పెట్టి పిలుచుకోమండి.
ప్ర: అలాగా, మీరిక వెళ్ల వచ్చు.

మా వాడు బయటకు వచ్చి లబొదిబొ మన్నాడు….

18/06/2007 రాసినది రాజేష్ గన్నారపు | జనరల్ - అబిప్రాయాలు | | అభిప్రాయములు

ఇలా చేసి చూడండి

కాగితం, కలం తెచ్చుకోండి (లేక పోతే నోట్ పాడో, వర్డ్ పాడో తెరవండి) .

ముందుగా మీరు అమితంగా ద్వేషించే వ్యక్తి కి చిట్ట చివరి ఉత్తరం రాయండి.

బాగా ఆలోచించి నెమ్మదిగా రాయండి. రాయటం పూర్తి ఐన తర్వాత మరో సారి సరిచూసుకోండి.

మీరు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత, ఆ లేఖ ను పక్కన పెట్టండి.

ఇప్పుడు మీరు అత్యంత ఇస్టపడే వ్యక్తి కి మీ చిట్ట చివరి ఉత్తరం రాయండి.

మీరు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత, మీరు ముందు రాసిన లేఖ ను ఇప్పటి లేఖ తొ పోల్చి చూడండి.

ఆశ్చర్యంగా రెండు లేఖ లొ మాటలు ఒకే విదంగా ఉంటాయి.

30/05/2007 రాసినది రాజేష్ గన్నారపు | జనరల్ - అబిప్రాయాలు | | అభిప్రాయములు

ఫిన్ లాండ్ లొ అవీ ఇవీ

మనకు ఫిన్ లాండ్ కు మధ్య కొట్టొచ్చినట్టు కొన్ని తేడాలు కనిపిస్తాయి.

ముందుగా వాతావరణం గురించి  చూద్దాం. ఇది ఒక శీతల దేశం. ఈ దేశాన్ని సరస్సుల దేశం అంటారు, కాని ఆ సరస్సులన్ని ఎప్పుడు గడ్డ కట్టి ఉంటాయి:-).అంటే వేసవి కాలం లొ కాదు అనుకోండి.

నీను దక్షిణ ప్రాంతము లో ఉండటం మూలాన నాకు Arctic Circle అనుభవం లాంటివి దక్కలేదు. ఇక్కడ సుదీర్ఘమైన పగల్లు రాత్రులను చూడవచ్చు. నీను ఇక్కడకు వచ్చిన అక్టోబర్ మాసం లొ కనుచూపు మేరా మంచు కనపడేది, దానితొ పాటు వెలుగు ఉండేది కాని సూర్యుడు జాడ మాత్రం కనిపించేదే కాదు. కేవలం గడియారం మీద ఆదారపడవలసి వచ్చేది. రోజు  రోడ్లపై, ఫుట్ పాత్ ల పై  ఒక రకమైన ఇసుక చల్లుతారు తద్వార ప్రయాణం సులభమవుతుంది. డిసెంబర్/జనవరి మాసాలలో మనం చక్కగా నదులపై నడుచు కుంటూ వెళ్లి పొవచ్చు. ప్రస్తుతం ఇక్కడ వేసవి కాలం రాబోతుంది. ఇప్పుడు రహదారులన్ని పచ్చని రంగు ని సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు ఎప్పుడు చూసినా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ఫిన్ లాండ్ లోని కొన్ని ప్రదేశాలలో 24 గంటలు సూర్యుడు ఉంటాడు.

ఇక్కడి ప్రజలు స్నేహ స్వభావులు, నీను ఇక్కడి కి వచ్చిన రోజు మొదటగా బస్సు లోనుండి దిగే ముందు, ఆ బస్సు డ్రైవర్ బస్సు దిగి నేలను చూపుతూ “this..  not earth all ice ” అని చెప్పాడు, నీను వెంటనె ” thank you” అన్నాను. దానికి వెంటనే “mita (=what)” అన్నాడు . నాకు ఎమి అర్థం కాలేదు. సరే Finnish నేర్చుకోని “thank you ” అని చెపుదామని  నా బసకు వెళ్లి పొయాను.

22/05/2007 రాసినది రాజేష్ గన్నారపు | జనరల్ - అబిప్రాయాలు | | అభిప్రాయములు

చెప్పుడు మాటలు ……అదే చెప్పిన మాటలు

మీ సమస్య లను ఎవరికి చెప్పకండి, 20% మంది పట్టించుకోరు మరియు 80% మంది మీకు కూడ ఆ సమస్యలు ఉన్నందుకు ఆనందిస్తారు.  -Lou Holtz

మీ గురించి ఎవ్వరికి వివరించ వలసిన అవసరం లేదు. మీ మిత్రులకు ఆ అవసరం లేదు మరియు నీ శత్రువులు ఏలాగు నమ్మరు.  -Belgicia Howell

 మీ శత్రువులను  క్షమించండి కాని వారి పేర్లు ఎప్పటికి మరచి పోవద్దు. -John F.Kennedy

వ్యక్తిత్వానికి నిజమైన కొలబద్ద ఎమిటంటె, తనకు ఏ మాత్రం ఉపయొగపడని  వ్యక్తి తొ ప్రవర్తించే తీరు మాత్రమే -Ann Landers

చెడ్డ వారితో ఆనందం గా ఉండే కన్నా మంచి వ్యక్తులతో భాద పడుతూ కలిసి ఉండటం మేలు.  -Philippos

16/05/2007 రాసినది రాజేష్ గన్నారపు | జనరల్ - అబిప్రాయాలు | | No Comments Yet