నాలో రేగే ఆలోచనలు

స్నేహం

స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వుతం,
స్నేహమెన్నడు బాదనివ్వదు, స్నేహమెప్పుడు శాంతి పంచును,
నీదు ముందర తప్పులెంచును, మంచి గుణముల ఎంచి చెప్పును,
స్నేహమంటే ఆట కాదొయ్,స్నేహమంటే బాద్యతొయ్,
స్నేహితులను ఎంచి చెప్పుడు, నీదు సుగుణంబులెన్నొ,
స్నేహితులను కలిగి యుండుట కంటె కలదే ఆనందము..

 .

.

.

.

.

చిన్న పేరడి ట్రై చేసా.. ఎలా ఉందొ చెప్పండి…

29/03/2007 రాసినది రాజేష్ గన్నారపు | కవితలు | | 1 వ్యాఖ్య

నిరీక్షణ

జీవన సమరంలొ ఒడ్డుకు చేరాలనే తొలి యత్నం,
కుదుపుతొంది నా జీవన శైలి ని క్షణక్షణం,
మరలిరాని సమయాన్ని సద్వినియొగపరచాలనే తాపత్రయం
                       విపరీతమైన శ్రమకు గురి చేస్తొంది,
పరిక్ష ముగిసింది…ఫలితాలే తరువాయి,
ఈ నిరీక్షణ తెలిపింది నాకు ఆ అనుభవమేమిటొ,
సాదించబొయే విజయాన్ని తలుస్తూ తీపి కలలు కంటున్నాను,
తీపి కలలు కంటున్నానొ లేక సమయమే వ్రుదా చేస్తున్నానొ
                      తెలీక సతమతమవుతున్నాను,

ఈ నిరీక్షణ తీపి గురుతులనే మిగులుస్తుందొ..
లేక వ్రుదా ఐనా సమయమై వెక్కిరిస్తుందొ………..:-(

29/03/2007 రాసినది రాజేష్ గన్నారపు | కవితలు | | No Comments Yet

సంక్రాంతి

ఇళ్లంతా మామిడితొరణాలు, పసుపులద్దిన గడపలు
ప్రతి ఇళ్లు సందడి తొ కళకళలాడుతొంది
ధాన్యం బస్తాల లెక్కలలొ బిజీ గా ఉండే తండ్రులు
చక్కగా గొబ్బెమ్మలు చెసి ఆనందించే చెల్లాయిలు
వారి ప్రతి పనిని చెడగొట్టి అల్లరి పెట్టే తమ్ముల్లు
ముద్దుగా వారిని గద్దించె తల్లుళ్లు
మరదళ్లను ఆటపట్టించె బావలు,ఇంట్లొ తిశ్ట వేసే అల్లుళ్లు
ఎవరిపని వారిదె ఐనా హడావుడి మాత్రం బొలెడు
ఏ అల్లరినంతా చూసి త్రుప్తి గా నిట్టూర్చే తాతయ్యలు
అందరి మోములపై ఎదొ తెలియని కాంతి
అవును, మనమంతా జరుపుకొటున్నాము సంక్రాంతి!!

14/03/2007 రాసినది రాజేష్ గన్నారపు | కవితలు | | No Comments Yet

ప్రేమికుడు

ఎలా తెలుపను నీ గురించి,

నా గుండె లొని భావమనా?

నా శరీరం లొని ప్రాణమనా?

ఎలా తెలిపిననూ సంత్రుప్తి లేదు

ఎందుకంటే

నీవు నేను అనే తేడానే లేదు..

శరీరం వేరైనా ఆత్మలం మనం,

భావ భేదాలు లేని ప్రేమికులం మనం..

09/03/2007 రాసినది రాజేష్ గన్నారపు | కవితలు | | No Comments Yet

చెలియ

కనులు మూస్తే చాలు ప్రత్యక్షమవుతావు,

కంటి నిండా కునుకు లేకుండా చేస్తావు,

పట్టుకొందామంటె చిక్కనె చిక్కవు,

ఎక్కడని వెదకినా దొరకనె దొరకవు,

అల్లరులతొనె అలసినే నా మనసు,

పరుగులిక ఆపి నా దరి చేరవె..

——————రాజెష్ గన్నారపు

03/03/2007 రాసినది రాజేష్ గన్నారపు | కవితలు | | 1 వ్యాఖ్య