నాలో రేగే ఆలోచనలు


మానవ సంబంధాలు
ఆగష్టు 3, 2007, 10:18 pm
ప్రచురించిన వర్గము నా పైత్యం

మానవ సంబంధాలు అన్ని కేవలం అవసరం మీదనే ఆధారపడి ఉన్నాయి.
నాకు తెలుసు చాలా మంది ఈ మాటను అంగీకరించరు.

ఇక్కడ అవసరం అన్న పదాన్ని సరిగా నిర్వచిద్దాము.
అవసరం అంటే కేవలం బౌతిక అవసరాలే కాదు, మానసిక అవసరాలు కూడ.
మీరు చెప్పవచ్చు, నాకు ఎటువంటి అవసరం లేని వ్యక్తులతో కూడ సంబందాలు ఉన్నాయి ఉదహరణకు స్నేహితులు, కుటుంబ సంబందాలు మొదలైనవి.
పై ఉదహరణలొ చెప్పిన వ్యక్తుల తొ మీకు మానసిక అవసరాలు లేవని చెప్పగలరా?
ఒక వ్యక్తి సన్నిహిత్యాన్ని మీరు కొరుకుంటున్నారు అంటే అక్కడ మీకు బౌతిక లేదా మానసిక అవసరాలు తీరుతున్నట్టే.
ఆ వ్యక్తి తొ కలిసి గడపటం వల్ల నేను ఆనందంగా ఉంటాను అనేది ఖచ్చితంగా మానసిక అవసరం లోకి వస్తుంది. 
మనిషికి బౌతిక అవసరాలు ఎంత ముఖ్యమో మానసిక అవసరాలు కూడ అంతే ముఖ్యం.

ఒక వ్యక్తి తన పెంపుడు జంతువు తో గడపటం వల్ల ప్రశాంతత/ఆనందాన్ని పొందుతాడు. మనుషులకు ప్రశాంతత లేదా ఆనందం అన్నవి మానసిక అవసరాల పరిది లోకి వస్తాయి.
కాబట్టి నేను చాల గట్టి గా చెప్పగలను

మానవ సంబంధాలు అన్ని కేవలం అవసరం మీదనే ఆధారపడి ఉన్నాయి.

మీ అబిప్రాయాలు  తెలియజేయండి.


2 వ్యాఖ్యలు ఇప్పటి వఱకు
మీ ఉద్దేశ్యం…

pls ignore my comments earlier - first time user of lekhini , so too many typos.Here they are again ..

ముందుగా తెలుగు లో విధి గా టపాలు రాస్తున్న మీకు నా అభినందనలు.

“ఇక మానవ సంభంధాలు అన్నీ అవసరం మీదనే అధారపడి ఉంటాయి..” అన్న మీ వ్యాఖ్య చాల వరకు నిజమే అని గోచరించ వచ్చు. మీరు అన్నట్లు , ఎకీభవించని వారిలో నేను మొదటి వడినీ కావచ్చు …

కనీ అందరూ అన్నీ ఎదో ఒకటి అసించే చేయరు అని నమ్ముతాను నేను. ఉదా. కుక్క పిల్లతో ప్రసంతత కొసమే గడిపే మనిషి , రొడ్డున పొయె కుక్క కి కాలు విరిగి రక్తం కరుతూ ఉంతే వెళ్ళి సహాయం చెయడా ? దారిన పొయే దనయ్య దరిద్రం తో అల్లడుతూ ఉంతే చూస్తు ఊరుకుంటడ ? తన ఇంట్లో అయినా , స్నేహితుని ఇంట్లొ అయినా , ఎక్కడో టీ.వీ లొ అయినా సుభకార్యన్ని చూసి సంతొష పడడా ? కన్న పిల్లవాడిని పెంచే తల్లి తండ్రులు వాడి నించి ఎమి అసించి పెంచుతారు ?

జీవించిన అంత కాలం చేసెయ్ మంచి పనులు , తనకు జరగ బోయె దానికొసమో, ఆనక స్వర్గాన్ని ప్రసాదిస్థయనే చేస్తాడా?

మనిషి గా పుట్టక , హృదయం ఉన్నక, అది తప్పక స్పందిస్ఠుంది. వేరొకడు ఎమి చెస్తాడో అన్న అలోచన వదలి , తన సాటీ మనుషులు సుఖంగా ఉండాలి అని అలొచించే భావన ప్రస్ఫుటంగా ఉండే వారు చెరిత్ర లొ ఎప్పటికీ నిలిచిపోతారు. ఒక భగత్ సింఘ్ అయిన, ఒక శివాజీ అయిన , ఒక మదర్ థెరీస అయినా ..

ప్రగతి సధిస్తూ, డబ్బులు సంపాదిస్తూ , తన కొసం, తన వరికొసం, తన లక్ష్యాల కొసం బ్రతుకుతూ , తన చుట్టూ కోట కట్టు కొన్న మనిషి మధ్యలో అలంటి వరి సంఖ్య తగ్గిన మాట నిజమే , కానీ స్పందించే హృదయం ఉన్నన్ని రొజులూ వాని పట్ల నిస్స్వర్ధంగా ప్రవర్తించే మనుషులూ ఉంటారు …

వ్యాఖ్య ద్వారా jiiva ఆగష్టు 4, 2007 @ 9:31 am

ఛాల బాగ చెప్పారు జీవా గారు.

నేను యండమూరి గారి పుస్తకంలో చదివాను ఇలాంటి వాక్యం. అన్ని బందాలు అవసరం మీదె అనుకోవటం పొరపాటు. ఏమి అశించకుండా కూడ కొన్ని పనులు చేస్తాం. కుక్క కాలు విరిగి కట్టు కట్టడం పున్యం కోసం, అని ఆలోచించొద్దు.

వ్యాఖ్య ద్వారా subhash డిసెంబరు 29, 2007 @ 7:49 pm



మీ ఉద్దేశ్యం…
Line and paragraph breaks automatic, e-mail address never displayed, HTML allowed: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>