ఎంటో మరీ
నాకు కొన్ని విషయాలు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది.
“దొంగతనం చేయరాదు” ఈ సూక్తి దాదాపు అన్ని మతాలు చెప్తాయి. దొంగతనం తప్పు అని కూడ చెప్తాయి. సరే ఒక ఉదహరణ తీసుకుందాం.
ఒక చిన్న పిల్లవాడు ఒంటరి వాడు, విపరీతమైన ఆకలి తో బాధ పడుతున్నాడు అనుకోండి. వాడికి భొజనం దొరికే అవకాశం లేదు, కొనగలిగే స్తోమత లేదు అనుకొండి
అప్పుడు వానికి దొంగతనం చేసి కడుపు నింపుకుందాం అనే ఆలొచన వస్తే అది వాడి తప్పు కాదు.
దొంగతనం చేయకూడదు అని ఆగితే చావక తప్పదు.
జీవితాని మించిన గొప్ప దర్మం ఏం ఉంటుంది చెప్పండి?
ఆ పిల్లవాడు దొంగతనం చేయాలా వద్దా? చేస్తే తప్పా? చేయకపోతే తప్పా?
ఎంటో మరీ!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
అభిప్రాయములు »
మీ ఉద్దేశ్యం…
-
ఖజానాలు
- ఆగష్టు 2009 (1)
- ఆగష్టు 2007 (1)
- జూన్ 2007 (5)
- మే 2007 (8)
- ఏప్రియల్ 2007 (5)
- మార్చి 2007 (37)
- ఫిబ్రవరి 2007 (10)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS
ఎందుకండి ఇంత విపరీతంగా ఆలోచించేస్తున్నారు?
నిన్న అమ్మ గురించి, ఈ రోజు ఆకలి గురించి…
అమ్మైనా, ఆకలైనా, ప్రేమైనా, పెళ్ళయినా… పరిస్తితుల్ని బట్టి తప్పొప్పులు మరుతూ ఉంటాయి.
మనిషిని చంపటం ఘోరం అని పాపం అని తెలిసిందే.
అర్ధరాత్రి ఇంట్లో చొరబడ్డ దొంగ తో తలపడి ఆ పోరు లో ఇంటాయన చనిపొతే అది దారుణం. అదే దొంగ చనిపోతే అది ఆ యజమాని ధైర్యం, సాహసం.
మీరింకా అర్థం చేసుకోని అంశమేమిటంటే-జీవితాన్ని ధర్మం ప్రాతిపదికన కాక మరో రకంగా జీవించడం సాధ్యపడదు. ప్రతి దొంగా ఇతరుల మంచితనం మీదనే ఆధారపడి బతుకుతాడు. తాను మాత్రం మంచిగా ఉండే అవసరం లేదనుకుంటాడు. మీరు వేసిన ప్రశ్ననే మరో రకంగా నేను వేస్తాను-ధర్మాన్ని విడిచిపెట్టాక జీవితమేముంటుందని !
ఆకలేసింది కాబట్టి దొంగతనం చేస్తా ! కోరిక కలిగింది కాబట్టి మానభంగం చేస్తా ! కోపం వచ్చింది కాబట్టి చంపేస్తా ! డబ్బు అవసరం కనుక మానాన్ని అమ్ముకుంటా ! ఇలా ఆలోచించేవాళ్ళెక్కువైతే ఈ సమాజంలో ఎవరికీ భద్రత ఉండదు. ఇంక జీవించేదేముంది ? మనం చిన్న స్థాయిలో అలవాటు చేసుకున్న ఆలోచనాధోరణి అలవాట్లు-మనం బాగా ఎదిగిపోయాక కూడా మనల్ని వదిలిపెట్టవు అని గ్రహించాలి.
If one’s hunger is all about a slice of bread, someone’s hunger may be all about a piece of human flesh. Would you then justify cannibalism too ?
ఇలాంటి తర్కాలు వ్యక్తి స్థాయిలో కమ్మగానే ఉంటాయి. సంఘస్థాయిలో మాఫియాలకీ మారణహోమాలకీ దారితీస్తాయి. వ్యక్తి స్థాయిలో మనం ఎవరికీ జవాబ్దారీ కాదని మనం అనుకుంటే ఆ తరువాత సంఘం నుంచి మానవత్వాన్ని ఆశించే హక్కు కోల్పోతాం. ఆదర్శాలు కూడు పెట్టవు. బానే ఉంది. కాని ఆదర్శాలు చేసే పని వేరు. కూడు చేసే పని వేరు.
బాలసుబ్రమణ్యంగారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
బాలసుబ్రమణ్యంగారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
నేను స్వాతి గారి లాగే ఆలోచించాను. పరిస్థితుల బట్టి న్యాయం మారుతుంది అని. అది ఏ సందర్భంలో జరిగిందో అనే దాని బట్టి కూడా న్యాయం, అన్యాయం మారవచ్చు.
కానీ బాలసుబ్రమణ్యం గారన్నది కూడా సబబే.
@lalithag gaaru,
నాకు అప్పుడప్పుడు వచ్చే అనుమానాలను బ్లాగ్ లో పెట్టటానికి ప్రయత్నిస్తున్నాను. దాని పలితమే ఈ విపరీత భావాలు.:-))
@swathi gaaru,
మీరు చెప్పిన దాని ప్రకారం దేనిని కూడ ఇది తప్పు అని ఇది ఒప్పు అని చెప్పలేం. మీ అబిప్రాయానితో నేను 100%(200% కూడ అనుకోవచ్చు) అంగీకరిస్తాను.
@ T.Bala Subrahamnyam gaaru,
మీరు చెప్పిన దానిని నేను నమ్ముతాను. అది అవసరం కూడ. నేను మీ వివరణ ను ఖండిచటం లేదు.
కాని నాకు కోన్ని ప్రశ్నలు ఉన్నాయి,
మనుషులు పుట్టిన తర్వాత నే కదా ధర్మాలు పుట్టాయి, నాకు అర్థం అయ్యినంత వరకు ధర్మాలు అనేవి మనిషి ని సక్రమ మార్గం లో పెట్టటాని కి పయోగపడాలి.
కాని తన తప్పు లేనప్పుడు కేవలం ధర్మం అనే దానిని ఆచరించి మరణించాలని ఎల చెప్పగలం?
సంఘస్థాయి లో ఇలాంటి భావజాలం విపరీతాలకు దారి తీస్తుంది అనే విశయాన్ని నేను ఒప్పుకుంటాను, కాని సంఘం అంటే వ్యక్తుల సముదాయం మాత్రమే, వ్యక్తి ప్రయొజనాన్ని సాదించలేని ధర్మం సంఘ ప్రయోజనాన్ని ఎల సాదించగలదు…(ఎమొ మరి)
ఇది ఒక ప్రశ్న అంతే
@praveen gaaru,
చదివితే నాకు కూడ రెండూ కరెక్ట్ అని పిస్తున్నాయి. అందుకే ఈ టపా పేరు అలా పెట్టాను:-))
రాజేష్ గారూ
ధర్మం మనిషి పుట్టాక పుట్టినది కాదు. మనిషి తయారు చేసుకున్నదీ కాదు. మనిషి కోసం పుట్టినది అంతకంటే కాదు. దాని పరిధి మానవ సమాజానికి అతీతంగా విస్తరించి ఉంటుంది. మనిషి చేసిన ఆవిష్కారాల (discoveries)లో అదొకటి. ధర్మం మనిషికి ఉపయోగపడనక్కరలేదు. అందుకు విరుద్ధంగా మనిషే ధర్మానికి ఉపయోగపడాలి. ధర్మం అంటే natural justice అని చెప్పుకోవచ్చు.
మనిషి మూడు దశల్లో తనని తాను తీర్చిదిదుకుటాడు. మొదటిది-చట్టస్థాయి. పోలీసువాణ్ణి చూసి భయపడే మనస్తత్వానికి సంబంధించినది ఇది. ఇలాంటివారు ఎవరూ చూడ్డం లేదనుకుంటే రాక్షసుల మాదిరి విజృంభిస్తారు.
రెండోది-న్యాయస్థాయి. ఏది చేస్తే తప్పు ? ఏది చేస్తే ఒప్పు ? అని తఱచి తఱచి తవ్వుకుని తర్కించుకుని నిర్ణయాలు తీసుకుని నడుచుకునే నడత ఇది. ఈ స్థాయిలో కొద్దిమంది ఉంటారు. వీళ్ళలో ఎక్కువమంది దేవుడికి భయపడతారు.
మూడోది మనస్సాక్షి స్థాయి. దీనికి చెందినవాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు. వీళ్ళు ఎవరికీ భయపడరు తమ మనస్సాక్షికి తప్ప. మంచిగా నడుచుకునేటప్పుడు వీళ్ళ మనస్సుల్లో ఏ విధమైన తర్కమూ జరగదు. వీళ్ళ మనస్సుల్లో చెడు పట్ల అత్యంత స్వాభావికమైన విముఖత ఉంటుంది. వీళ్ళ ప్రవర్తన చాలా సహజంగా న్యాయంగా అనుకోకుండానే ధర్మబద్ధంగా వెళుతూంటుంది.
మీరు రాసిన స్థితి మొదటి స్థాయి కంటే ఆదిమ దశకి చెందినవారి గురించి. ఆ దశకి ధర్మాన్ని నిర్ణయించుకునే శక్తి లేదు. అమలుపరచే శక్తి అంతకంటే లేదు. అంతమాత్రాన ధర్మాలన్ని అబద్ధాలై పోవు. కొంతమంది రోగుల మీద ఏ మందులూ పనిచెయ్యక అవసాన దశలో ఉంటారు. అంతమాత్రాన వైద్యశాస్త్రమంతా అబద్ధమై పోదు. వైద్యశాస్త్రం మనిషికి ఉపయోగపడితే బావుంటుంది. కాని మనిషి వైద్యశాస్త్రాన్ని కనుగొనకముందే అది ప్రకృతిలో ఉనికిలో ఉంది.
అయినా ఆకలేస్తే అన్నం దొరకని పరిస్థితి సమాజంలో లేదు. నిజానికి ఈ ప్రపంచంలో నేరాలు ఆకలి మూలంగా జరగడం లేదు. ఆకలిని మించిన ఖరీదైన ఆకాంక్షల కోసం జరుగుతున్నాయని గమనించండి.
@ @ T.Bala Subrahamnyam gaaru,
చాలా చక్కగా వివరించారు.
Thanks for the explanation
నా అంచనా ప్రకారం బాలసుబ్రమణ్యం గారు దనిక వర్గానికి చెందిన వారై వుంటారు. ఆకలి చావులు వుండవా మీ వుద్దెష్యంలొ..పత్తి రైతులది ఆకలి చావు కాదంటార.
అప్పులు తీర్చలెక ఎవరికి చెప్పుకోలెక అత్మాబిమానం చంపుకొలెక రైతులు అత్మ హత్యలు చేసుకుంటునరు.. కొందరు పిల్లలతొ సహా. దర్మం తప్పి మేము అప్పు తిసుకొలెదు అనొ లేక ఎదొవిదంగ బ్రతకొచుకదా ఇది నిజం సంగటన దీనిగురించి అలొచించండి…
అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.