నాలో రేగే ఆలోచనలు


తల్లి ప్రేమ
జూన్ 26, 2007, 7:54 pm
ప్రచురించిన వర్గము నా పైత్యం

తల్లి ప్రేమ గురించి చిన్న సంభాషణ జరిగింది చెపుతాను….
ఎక్కడ, ఎప్పుడు ఎవ్వరి మద్య జరిగిందో వదిలేసి విషయానికి వస్తాను.

సంభాషణ మధ్యలో
మొదటి వాడు: తల్లి ప్రేమ చాలా గొప్పది కదా మామ!
రెండవ వాడు: అవును :-)

మొదటి వాడు: తల్లి అవసరమైతే తన ప్రాణాల ఇచ్చి మరి బిడ్డలను కాపాడుకుంటుంది…
రెండవ వాడు: నవ్వుతూ ….నిజమే మరి , ఎన్ని సినిమాలలో చూపలేదు!!

మొదటి వాడు: అంటే అది నిజం కాదు అంటావా??
రెండవ వాడు: నిజమే అనుకొ మామ…

మొదటి వాడు: నా విషయం వదిలెయ్యి, నీ గురించి చెప్పు??
రెండవ వాడు: తల్లి ప్రేమ గొప్పదని ఒప్పుకుంటాను కాని ప్రాణాలు ఇచ్చేంత…..కాదని ..

మొదటి వాడు: సరే, ఊదహరణకు ఇల్లు కాలిపొతుందనుకో, ఏ తల్లి ఐన ప్రాణాలు తెగించి మరి బిడ్డలను కాపాడుకుంటుంది కదా
రెండవ వాడు: ఐతే

మొదటి వాడు: ఇంత కంటే మంచి ఉదహరణ ఏం కావాలి ?
రెండవ వాడు:సరే, నీను కూడ ఒక ఊదహరణ చెపుతాను విని  ఆ తర్వాత … ఒకే

రెండవ వాడు: కూతురు …కిడ్నిలు పాడు అయ్యి మంచం పట్టింది అనుకో..
వైద్యుడు చెప్పాడు, ఎవరైన కిడ్ని లు దానం చేస్తే తప్ప బతికే అవకాశం లేదు అని..

దురదృష్టవశాత్తు తల్లి కి ఒక కిడ్ని మాత్రమే ఉంది అనుకుందాం…..
అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది… తన కిడ్ని దానం చేస్తుందని నీను అనుకోవడం లేదు

ఎందుకంటే, మొదటి ఊదహరణ లో అది ఆవేశం మాత్రమే… ఆ క్షణం లొ పుట్టే క్షణికావేశం మాత్రమే!!!!
రెండవ ఊదహరణ లో ఆవేశాని కి తావు లేదు… నింపాదిగా ఆలోచించుకోని నిర్ణయం తీసుకోవచ్చు … కాబట్టి…..

Note: ఈ టపా మిమ్ముల్ని భాద పెడితే, వీటిని  కేవలం నా అభిప్రాయాలు గా భావించి వదిలేయ్యండి.


20 వ్యాఖ్యలు ఇప్పటి వఱకు
మీ ఉద్దేశ్యం…

మాష్టారు, మీది వైజాగ్ ప్రాంతమా ?
“నీను” కాదండి, “నేను” అని రాయలి.

వ్యాఖ్య ద్వారా dvnsravan జూన్ 26, 2007 @ 8:44 pm

ఇంతకీ ఆ తల్లికి ప్రేమ ఉన్నట్టంటారా, లేక లేనట్టంటారా మీ అభిప్రాయంలో?

వ్యాఖ్య ద్వారా lalithag జూన్ 26, 2007 @ 9:39 pm

మీ వాధనలో లోపముందండి. దాని వలన బధపడితే వారికి నా సంతాపం.
రెండవ ఉదాహరణ లో logic flawed అనాలి.

ఒక తల్లీ బిడ్డ ఉన్నారు.
ఇద్దరికీ ఒక కిడ్నీ అవసరం, కాని వారికి ప్రంచమంతా వెదికినా ఒక కిడ్నీయే దొరుకుతుంది.
అప్పుడు తల్లీ కిడ్నీని లాక్కుంటుందా బిడ్డ దగ్గర నుండి ? ఇక్కడ ఏ ఆవేశాలు లేవు.
ఈ ప్రశ్నకు సమాధానం కూడా వ్యక్తి వ్యక్తికీ మారవచ్చు.
“ఎఁమో చెప్పలేం ” అనేవారికి నిజంగా నా సంతాపం…

వ్యాఖ్య ద్వారా రాకేశ్ జూన్ 26, 2007 @ 10:13 pm

@lalithag gaaru,
రెండవ వాడి అభిప్రాయమే నా అభిప్రాయము…

@dvnsravan gaaru,

thanks for the correction,
I am from Nalgonda dist

వ్యాఖ్య ద్వారా రాజేష్ గన్నారపు జూన్ 26, 2007 @ 10:16 pm

@lalithag gaaru

తల్లి కి ప్రేమ ఉండదు అని నేను అనటం లేదు,
“తల్లి అవసరమైతే తన ప్రాణాల ఇచ్చి మరి బిడ్డలను కాపాడుకుంటుంది” అనే మాటను నేను అంగీకరించను..

వ్యాఖ్య ద్వారా రాజేష్ గన్నారపు జూన్ 26, 2007 @ 10:19 pm

@రాకేశ్ gaaru,
తల్లుల మీద బిడ్డల ప్రేమ గురించి నేను చెప్పటం లేదు, అలాంటి పరిస్థితి వస్తే తల్లి, బిడ్డలకు కిడ్ని ఇస్తుందా లేదా అన్న విషయం మాత్రమే నేను మాట్లాడాను

వ్యాఖ్య ద్వారా రాజేష్ గన్నారపు జూన్ 26, 2007 @ 10:31 pm

ఒకసారి మా ఇంట్లో ఒక పెద్ద పాము వచ్చింది. దాన్ని చూడగానే నా సోదరికి జ్వరం వచ్చింది. దాన్ని చంపకుండా ఏదైనా చేసి పంపించేద్దామన్న నా సలహా వంక ఒక వెర్రి చూపు చూసి మా అమ్మ, నన్నూ నా సోదరిని టేబుల్‌పై నిలబెట్టి దాన్ని చంపేసింది. అసలే గుండె జబ్బు మనిషి…

వ్యాఖ్య ద్వారా Nagaraja జూన్ 26, 2007 @ 10:31 pm

ఇలా hypothetical గా సమస్యలను ఉదహరించి తల్లి ఎంత త్యాగం చెయ్య గలదు అని నిర్ణయించ బూనుకోవడం అర్థం లేనిది. ఇది తల్లీ బిడ్డలదే కాదు, ఏ సంబంధంలోనైనా వ్యక్తిగతం, పూర్తిగా.

ఇంతకీ తల్లి నుండి ఏమిటి ఆశించేది?

చందమామలో చిన్నప్పుడు ఒక కథ చదివాను. అందులో ఒక రాకుమారుడి ప్రాణాలు పోయే దశలో ఉంటే ఒక మాంత్రికుడు తన ప్రాణాలిచ్చి రాకుమారిడిని బ్రతికించచ్చు అని రాజుకు చెప్తాడు. అప్పుడు రాజు, తాను చనిపోతే ఈ చిన్న పిల్లాడిని అలుసు చేసి తన శత్రువులు రాజ్యమ కాజేసి భార్యను, పిల్లాడినీ కష్టాలలో పడెయ్యడమో చంపెయ్యడమో చేస్తారని తన ప్రాణం ఇవ్వడానికి ముందుకు రాడు. ఆ రాజు ప్రేమతో ఆలోచించాడంటారా, లేదంటారా?

ఎవరండీ మనం ఇంకొకరిని judge చెయ్యడానికి, అదీ hypothetical గా?

ఎవరి కుటుంబంలో వారు ఎవరి పాత్రలను వారు సరిగా పోషిద్దాం. తల్లి ప్రాణాలకు తెగిస్తుందా లేదా అన్నది దైనందిన సమస్య కాదు. అది exceptional పరిస్థితి. excpetional పరిస్థితులలో ఎవరం ఎలా నిర్ణయాలు తీసుకుంటామో ఎవరికీ ఆ క్షణం దాకా తెలియదు. ఏ మనిషికీ అటువంటి విపరీత పరిస్థితులు ఎదురవ్వకూడదని ప్రార్థిద్దాం.

నా ఈ వ్యాఖ్య మీకు బాధ కలిగిస్తే ఇది నా అభిప్రాయం మాత్రమే అని అర్థం చేసుకోగలల్రు.

వ్యాఖ్య ద్వారా lalitha జూన్ 26, 2007 @ 10:54 pm

@lalitha gaaru,

నేను కూడ తల్లి ప్రేమ తక్కువని చేప్పటం లేదండి, ఈ ప్రేమ కు కూడ అన్ని ప్రేమ ల లాగానే పరిమితులు ఉన్నాయని చెప్పటమే నా ఉద్దేశం..
>>ఇది తల్లీ బిడ్డలదే కాదు, ఏ సంబంధంలోనైనా వ్యక్తిగతం, పూర్తిగా.
నిజమే నేను ఒప్పుకుంటాను..తల్లి ప్రేమే కాదు, ఏ సంబంధంలోనైనా వ్యక్తులను బట్టి ప్రేమ మారుతుంది.దానిని అంగీకరిస్తారనుకుంటాను.

వ్యాఖ్య ద్వారా రాజేష్ గన్నారపు జూన్ 26, 2007 @ 11:11 pm

నేను రాజేష్ గారి అభిప్రాయాలతో చాలా వరకు ఏకీభవిస్తున్నాను.ఆంటె నా ఉద్దేశం లొ అయన చెప్పదలచుకున్నది ఎమిటొ జస్ట్ రెండు simple examples తీసుకొని వర్నించారు అనుకుంటున్నాను.అంతే కాని ఆ situation లో ఎ తల్లి ఐనా అలానె ప్రవర్తిస్తుంది అని కాదని నా అభిప్రయం. తల్లి ప్రేమ అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి.
కాని మనం ఒకటి గుర్తుంచు కొవాలి ఏ ప్రేమ ఐన సరె ఎదొ ఒక వుమ్మడి ప్రయొజనం లెక పొతే మాత్రం చాల కాలం వరకు కొన సాగాధు.
మీరనవచ్చు ఏ ప్రతిఫలం ఆసించకుండ తల్లి ప్రెమ వుంటుందని…i dont think so …అలాంటి attachement మనం చాలా రొజులుగా వాడిన pen,book etc మీద కూడా కలుగుతుంది. ఇది complete గా నా అభిప్రాయం మత్రమే….ఎవరినైనా బాధిస్తే క్షమించ గలరూ
చివరిగా: u can experience the mother’s love..but not explain it with examples

వ్యాఖ్య ద్వారా vijay జూన్ 27, 2007 @ 12:40 am

తల్లిబిడ్డ ప్రేమ ప్రకృతి సహజమైనది.దానికి నిర్భందాలు,లాజిక్కులు చేర్చకండి.ప్రేమను త్రాసులో వేయలేము.ఏ ప్రేమైనా మనసులో నుండి ఉద్భవించాలి.

వ్యాఖ్య ద్వారా mounimounamlo జూన్ 27, 2007 @ 7:19 am

ఇది కేవలం ఒక కధ లాంటిది మాత్రమే. దీన్లో త్రాసు లో వేయటం, కొలవటం లాంటివేమీ లేవు.
ప్రేమ అనేది ప్రతి సంబంధం లోను ఉంది. కాని దానికి హద్దు ఎంత వరకు, ఎవరి త్యాగం పరిధి ఎంత అనేది మాత్రం universal కాదు. వ్యక్తిని బట్టి పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉంటుంది.

వ్యాఖ్య ద్వారా swathi జూన్ 27, 2007 @ 12:37 pm

[...] తల్లి ప్రేమ, మానవులని తయారు చెయ్యాలి. [...]

పింగ్ బ్యాక్ ద్వారా తల్లి ప్రేమా? « ఓనమాలు జూన్ 27, 2007 @ 6:27 pm

@Nagaraja gaaru
మీరు తీసుకున్న ఉదహరణ వ్యక్తిగతమైనది, కాబట్టి దానిని ఖండిచే సాహాసం నేను చేయ్యటం లేదు.
మీరు చెప్పిన ఉదహరణ నేను చెప్పిన మెదటి ఉదహరణ లోకి వస్తుంది అని నేను అనుకుంటున్నాను.

వ్యాఖ్య ద్వారా రాజేష్ గన్నారపు జూన్ 27, 2007 @ 6:50 pm

తల్లి ప్రేమ కు కూడ అన్ని ప్రేమ ల లాగానే పరిమితులు ఉన్నాయని చెప్పటమే నా ఉద్దేశం.. ఒకవేళ మీకు నా టపా లో ఆ ఉద్దేశం కనిపించకపోతే ఖచ్చితంగా తప్పు నాదే…
@all
మీ అబిప్రాయాలు నాతో పంచుకున్నందుకు దన్యవాదాలు

వ్యాఖ్య ద్వారా రాజేష్ గన్నారపు జూన్ 27, 2007 @ 6:56 pm

మీరు చెప్పిన రెండవ ఉదాహరణ నాకు సబబుగా అనిపించట్లేదు.రెండు కిడ్నీలు వుండి వుంటే మరింకే ఆలోచనా లేకుండా ఇచ్చేస్తుంది తల్లి.ఒకటే వున్నప్పుడు డాక్టర్లు ఒప్పుకోరు.అయినా పాపం ఒకటే కిడ్నీ వున్నప్పుడు ఆ తల్లి మాత్రమే ఎందుకు ఇవ్వాలి?ఏమి చేసినా బయట కిడ్నీ దొరకక, దొరికినా మేచ్ అవ్వకపోతే ఆలోచించి ఆ తల్లే ఇస్తుంది.పైన ఎవరో అన్నారు కూతురికి,తల్లికి ఒకేసారి కిడ్నీ అవసరమయితే ఏమిటి పరిస్తితి అని?ఆ కిడ్నీ ని ఎవరు తీసుకుంటారు అన్నది కూడా పరిస్తితిని,ప్రదేసాన్ని ,ఆ మనుషుల్లోని మానవతా కోణాన్ని బట్టి వుంటుంది.ఇండియాలో తల్లులయితే 99% కూతురికే వదిలేస్తారు.అదే అమెరికా లాంటి దేశాల్లో అయితే చెప్పలేము.
ఇక్కడ కిడ్నీల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలి.మా దగ్గరవాల్లు ఒకాయనకి కిడ్నీలు రెండూ చెడి పోయాయి.ఆయన భార్య ఆరోగ్యం అంత బాగుండదు.[కిడ్నీలు బానె పనిచేస్తున్నాయి]ఆమె కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వస్తె డాక్టర్లు ఒప్పుకోలేదు.ఆమె ప్రాణానికే ప్రమాదం అన్నారు.అయినా ఆమె వినకుండా ఇచ్చేసారు.అన్ని సవ్యం గా జరిగాయి అనుకున్నాకా 6 నెలలకి ఆమె చనిపోయారు.ఆ తరువాతే ఆమె భర్త కూడా.ఇలా చూసుకుంటే మనదేశం లో త్యాగాలు చేసే భార్యలు,తల్లులు చాలా ఎక్కువ.వాళ్లని దేవతలని చెయ్యక్కర్లద్దు.వాల్లు చేస్తున్నదానికి మనుషుల్లా చూస్తూ కొద్దిగా క్రుతజ్ఞత చూపండి చాలు.

వ్యాఖ్య ద్వారా radhika జూన్ 28, 2007 @ 6:16 pm

:-)

వ్యాఖ్య ద్వారా రాజేష్ గన్నారపు జూన్ 28, 2007 @ 7:27 pm

నేను తల్లుల పట్ల క్రుతజ్ఞత చూపకూడదని, వాళ్ల ను మనుషుల్లా చూడకూడదని ఎక్కడ చెప్పలేదు. నా భావం కూడ అది కాదు.

వ్యాఖ్య ద్వారా రాజేష్ గన్నారపు జూన్ 28, 2007 @ 7:44 pm

నిజాన్ని నిర్బయంగా చూడండి,తప్పు అబిప్రాయమని అనిపిస్తే వివరించండి.
కాని ఆవేశానికి లోను అయ్యి కామెంట్ రాస్తే నా అబిప్రాయాన్ని సరిదిద్దునట్టు కాదు కదా.
ఆవేశపూరితమైన కామెంట్ వల్ల నా అభిప్రాయం సరి అని నేను అనుకుంటాను, అలాగే మీ అభిప్రాయం సరి అని మీరు అనుకుంటారు.
అలాంటప్పుడు ఈ బ్లాగ్ ల వల్ల ఉపయోగం ఎముంది చెప్పండి.
నేను నా బ్లాగ్ ద్వారా ప్రపంచానికి నీతులు చెప్పటం లేదు , నా అభిప్రాయాలు చెపుతున్నాను అంతే.

వ్యాఖ్య ద్వారా రాజేష్ గన్నారపు జూన్ 28, 2007 @ 7:45 pm

మహానుబావ రాజేష్

నీ బ్లాగ్ ల వల్ల నీతులు చెప్పట్లెదు కాని ఆ అబిప్రాయాలు కొందరి అలోచనల మీద ప్రబావం చూపుతుంది. ఇదన్నా తెలుసా..

మా వీధి లోని ఒకావిడ తన కొడుకుకు కిడ్ని పాడవుతె, ఎవరూ ఇవ్వడానికి ముందుకు రాకపొతె తన ఒక కిడ్ని ఇచ్చింది. ఇది real incident కల్పితం కాదు.

ఆ మద్య పుట్టి మునిగి దాదాపు 15 మంది వరకు చనిపొయిన సంగతి గుర్తుందా.పుట్టి మునిగి ప్రవాహంలో కొట్టుకుపోతె బర్త,బార్య ను కాపడె ప్రయత్నం లొ మునుగుతుంటె నాకన్న నువ్వె ముక్యం పిల్లలకు అని చేయివిదిలించుకొని జలసమాది అయిన ఆ తల్లి గురించి తెలుసా (next day that was in news paper)

ఇక్కడలెదా త్యాగం

బిడ్డ ఎడుస్తున పట్టిచుకొకుండ T.V. Serial, Cinema చూసె తల్లుల్ని కుద నేను చుసాను వాల్లు అదునిక మహిలలట,

మన చుట్టుపక్కల వల్లని చుసి ఇంతె ప్రపంచం అందరు ఇలానె వుంటరు అనుకొవడం అవివేకం..కాకపొతె ప్రెమలు, త్యాగాలు తగ్గుతున్నాయి ఎవరు లేరు అనుకొవదు… మా అమ్మ తప్పక ఇస్తుంది నేను సాక్ష్యం

వ్యాఖ్య ద్వారా subhash డిసెంబరు 30, 2007 @ 4:35 pm



మీ ఉద్దేశ్యం…
Line and paragraph breaks automatic, e-mail address never displayed, HTML allowed: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>