నాలో రేగే ఆలోచనలు


ఫిన్ లాండ్ లొ అవీ ఇవీ
మే 22, 2007, 7:41 pm
ప్రచురించిన వర్గము జనరల్ - అబిప్రాయాలు

మనకు ఫిన్ లాండ్ కు మధ్య కొట్టొచ్చినట్టు కొన్ని తేడాలు కనిపిస్తాయి.

ముందుగా వాతావరణం గురించి  చూద్దాం. ఇది ఒక శీతల దేశం. ఈ దేశాన్ని సరస్సుల దేశం అంటారు, కాని ఆ సరస్సులన్ని ఎప్పుడు గడ్డ కట్టి ఉంటాయి:-).అంటే వేసవి కాలం లొ కాదు అనుకోండి.

నీను దక్షిణ ప్రాంతము లో ఉండటం మూలాన నాకు Arctic Circle అనుభవం లాంటివి దక్కలేదు. ఇక్కడ సుదీర్ఘమైన పగల్లు రాత్రులను చూడవచ్చు. నీను ఇక్కడకు వచ్చిన అక్టోబర్ మాసం లొ కనుచూపు మేరా మంచు కనపడేది, దానితొ పాటు వెలుగు ఉండేది కాని సూర్యుడు జాడ మాత్రం కనిపించేదే కాదు. కేవలం గడియారం మీద ఆదారపడవలసి వచ్చేది. రోజు  రోడ్లపై, ఫుట్ పాత్ ల పై  ఒక రకమైన ఇసుక చల్లుతారు తద్వార ప్రయాణం సులభమవుతుంది. డిసెంబర్/జనవరి మాసాలలో మనం చక్కగా నదులపై నడుచు కుంటూ వెళ్లి పొవచ్చు. ప్రస్తుతం ఇక్కడ వేసవి కాలం రాబోతుంది. ఇప్పుడు రహదారులన్ని పచ్చని రంగు ని సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు ఎప్పుడు చూసినా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ఫిన్ లాండ్ లోని కొన్ని ప్రదేశాలలో 24 గంటలు సూర్యుడు ఉంటాడు.

ఇక్కడి ప్రజలు స్నేహ స్వభావులు, నీను ఇక్కడి కి వచ్చిన రోజు మొదటగా బస్సు లోనుండి దిగే ముందు, ఆ బస్సు డ్రైవర్ బస్సు దిగి నేలను చూపుతూ “this..  not earth all ice ” అని చెప్పాడు, నీను వెంటనె ” thank you” అన్నాను. దానికి వెంటనే “mita (=what)” అన్నాడు . నాకు ఎమి అర్థం కాలేదు. సరే Finnish నేర్చుకోని “thank you ” అని చెపుదామని  నా బసకు వెళ్లి పొయాను.


2 వ్యాఖ్యలు ఇప్పటి వఱకు
మీ ఉద్దేశ్యం…

ఓహో! మీరన్నమాట టుర్కు, ఫిన్లాండు నుండి వస్తున్న చదువరి! :)

వ్యాఖ్య ద్వారా చదువరి మే 23, 2007 @ 2:29 pm

చాలా బావుంది. అక్కడి విశేషాలు, వీలైతే కొన్ని బొమ్మలతో సహా ఇలా రాస్తుండండి.
డోస్టోయెవ్స్కీ చెప్పిన శ్వేతరాత్రులు అక్కడకూడ కనిపిస్తాయా?

వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ మే 23, 2007 @ 9:18 pm



మీ ఉద్దేశ్యం…
Line and paragraph breaks automatic, e-mail address never displayed, HTML allowed: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>