నాలో రేగే ఆలోచనలు

పాలిటెక్నిక్

అవి నీను పదవ తరగతి చదివే రొజులు. ఒకరొజు మా పాఠశాల కు మా ప్రదానోపాద్యాయుల వారి మిత్రుడు వచ్చాడు. అతను మా తరగతి లొకి వచ్చి అందరిని లేపి పదవ తరగతి తరువాత ఏం చదువుతావు అని ఆడగటం మొదలు పెట్టాడు. అమ్మాయి లంతా డాక్టర్ చదువుతామని అబ్బాయి  లంతా ఇంజనీరింగ్ చదువుతామని చెప్పసాగారు. కొద్ది మంది పిల్ల కాయలు మాత్రం లాయర్ అలా చెప్పారు. నా వంతు రాగానే బుద్దిమంతుడిలా లేచి నిలబడి చేతులు కట్టుకొని నీను పాలిటెక్నిక్ చదువుతానని చెప్పాను. అంతే చెంప పగిలిపొయింది. నాకు ఎమి అర్థం కాలేదు. అతను అన్నాడు “లెక్కలు బాగా చేస్తావు కదా, ఇంజనీరింగ్ చేయాలి అన్నాడు” నీను బిక్క మొఖం తొ “అలాగే” అన్నాను. మనసు లొ మాత్రం నీను పాలిటెక్నిక్ చదవాలని నిర్ణయం తీసుకొన్నాను. ఐనా వీళ్లకేం తెలుసు పాలిటెక్నిక్ గొప్పదనం.పాలిటెక్నిక్ చదివే మా చిన్న మామ మా ఇంటికి వచ్చినపుడు మా అమ్మ చూపే అభిమానం గౌరవం,  పెద్ద చదువులు చదువుతున్నాడని అనందపడే  తాత అమ్మమ్మ లు, మామ ను చూసి గౌరవించే బందువులు…… అబ్బొ ఎన్నని చెప్పగలను, అసలు ఇంత కంటే పెద్ద చదువు అంటూ ఉంటుందా? అలా సాగిపొయేవి నా అలోచనలు… అందుకే ఇంటర్ రెండు సంవత్సరాలు ఉచితంగా చదువు చెప్తామని వచ్చిన అవకాశాలను  వదిలేసి పాలిటెక్నిక్ లొ చేరి పొయాను…

15/05/2007 - రాసినది రాజేష్ గన్నారపు | జనరల్ - అబిప్రాయాలు | | అభిప్రాయములు

అభిప్రాయములు »

  1. బాగుందండి కధ.
    మన వ్యవస్థ మనము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని ఎలా మోసం చేస్తుంది అన్నదాన్ని బగా వివరించారు.
    నేను కూడా మా అమెరిగా చిన్నాన్నను చూసి అమెరికా వచ్చా, కాని ఇప్పుడు ఎందుకు వచ్చానా యని అనుకుంటున్నాను…

    తరువాత ఏమైందో వివరిస్తే చాలా బాగుంటుంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాకేశ్ | 15/05/2007 | జవాబు

  2. నాకు తెలిసి నువ్వు పాలిటెక్నిక్ చెస్తునప్పుడు మీ ఇంటికి ఇంజనీరింగ్ చేసెవారు ఎవరొ వచ్చి నప్పుడు వాల్లకు ఇఛ్చే మర్యాద చూసి ముచ్చట పడి ఎలాగ అయిన ఇంజనీరింగ్ చెయ్యాలనుకొని వుంటావ్?. కదా!.. ఆ తరువత కుడా కంపుటెర్ వుద్యొగం …… ఇంక తరువాత ఎంటి మామా? జర సెలవీయరాదె?

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా jaya prakash | 28/04/2009 | జవాబు


మీ ఉద్దేశ్యం…