నాలో రేగే ఆలోచనలు

ఓడ మీద ప్రయాణం…

ఫిన్ లాండ్ కు వచ్చి 6 నెలలు అవుతున్న సందర్బం లొ స్వీడన్ యాత్ర కు శ్రీకారం చుట్టాము.నా ప్లాన్ ఎమిటంటె ఓడ లొ స్టాక్ హొం(Stockholm) కు వెల్లి తిరిగి తుర్కు మహ నగరానికి తిరిగి రావటమె. మహ నగరము అన్నాను కదా అని నిజం గానే మహ నగరము అనుకొకండి, మన వాటితొ పొలిస్తే చిన్న ఉరు, మన కూకట్ పల్లి అంత ఉంటుంది. ఫిన్ లాండ్ నుండి అంటే తుర్కు,హెలిసింకి ల నుండి రొజు ఓడ లు స్టాక్ హొం కు వెల్లి వస్తుంటాయి.

తుర్కు నుండి ముందు రొజే బయలుదేరి హైలిసింకి లొ ఉన్న మిత్రులను కలుసుకొని ఆ తరువాత రొజు ప్రయాణానికి  సిద్దం అయ్యాము. సాయత్రం 4:00 లొపల పొర్ట్ కు చేరుకొన్నాము. పెద్ద ఓడ ను చూస్తే చాల ఆనందం వేసింది. విమాన ప్రయాణం, రైలు ప్రయాణం మరియు బస్సు ప్రయాణం ల తొ పొలిస్తే ఓడ ప్రయాణం తప్పనిసరిగా వెరైటి అనుభవం. చాలా మంది ఈ ఓడ ప్రయాణం కొసమే స్వీడన్ కు వెల్లి వస్తుంటారు. సొదాలు గట్ర ఐన తర్వాత ఓడ లొ కి వెళ్లాము. మీము ప్రయాణిస్తుంది వికింగ్ లైన్ వారి ఓడ. 10 అంతస్తులు ఉన్నాయి, మాకు 6 వ అంతస్తు లొ రూం ఇచ్చారు. రూం లొ సామాను  పడేసి వెంటనే డెక్ పైకి వెళ్లాము. డెక్ పై నుండి సముద్రాన్ని అలా చూస్తూ ఉండిపొయాం. చక్కని పరిసరాలు చూడ ముచ్చటగ ఉన్నాయి. చుట్టు ఉన్న ఐలాండ్ లను చూస్తూ మైమరచిపొయాం. కొన్ని ఫొటొ లు దిగిన తరువాత కిందకు వెళ్లి ఓడ అంతా ఒక సారి తిరిగాము.సౌన, భొజనశాల, నైట్ క్లబ్, డిస్కొ మరియు టాక్స్ ఫ్రీ షాప్ లు ఉన్నాయి. కాసేపు షాపింగ్ చేసి , కాసేపు డిస్కొ లొ గడిపి నిద్ర పొయాము.ఆ మర్నాడు ఊదయం 10:00 గంటలకు స్టాక్ హొం చేరాము. స్టాక్ హొం లొ వాసా మ్యూజియం చూసి మళ్లి అదే ఓడ లొ తిరుగు ప్రయాణం అయ్యాము.

13/05/2007 - రాసినది రాజేష్ గన్నారపు | జనరల్ - అబిప్రాయాలు | | అభిప్రాయములు

అభిప్రాయములు »

  1. Finland లోని సుదీర్ఘ రాత్రులు, పగళ్ళూ ఇంకా Arctic Circle అనుభవం చాల విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు Northern Lights. వాటి గురించి రాసే ప్రయత్నం చెయ్యండి. మీతొ camera తీసుకెళ్ళ లేదా?

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా cbrao | 14/05/2007 | జవాబు

  2. camera తీసుకెళ్లాను రావు గారు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజెష్ గన్నారపు | 14/05/2007 | జవాబు


మీ ఉద్దేశ్యం…