నాలో రేగే ఆలోచనలు

ధరల పెరుగుదలకు సాప్ట్ వేర్ ఉద్యొగులు కారణమా?

అదేంటొ సాప్ట్ వేర్ ఉద్యొగులు  అంటే అందరికి వేళాకోలామే. మొన్న పాలు కొందామని షాపు కి వెళ్ళా, ఆమె కు ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కాని సాప్ట్ వేర్ ఉద్యొగులు వల్ల ధరల పెరుగుతున్నయని సాప్ట్ వేర్ ఉద్యొగులను  తిట్టటం మొదలు పెట్టింది.

ఎమండి ఆన్ సైట్ కు వెళ్ళని సాప్ట్ వేర్ ఉద్యొగులు  మిడిల్ క్లాస్ కాదా? వాళ్ళ జీతాలు గవర్నమెంట్ జాబ్స్ కంటె ఎలా ఎక్కువ? కనీసం బజ్జి ల బండి వాడి కంటె తక్కువ సంపాదన తొ బతుకుతాడు.

ఏ గవర్నమెంట్ జాబ్ చూసిన 20000 బేసిక్ అంటే దాదాపు 35000 నుండి 40000 జీతం వస్తుంది పైగా జాబ్ సెక్యురిటి, ఇంకా పబ్లిక్ సర్వీస్ లొ ఐతే పై రాబడి కుడా ఉంటుంది.
 
సాప్ట్ వేర్ లొ చెప్పేది CTC అందులొ సగం వేరియబుల్ అంటాడు రెండు సార్లు pf కట్ చేసి incometax కట్ చేసి చివరకు 20000 చేతిలొ పెడతాడు.. ఆ 20000 ఎదొ పుణ్యానికి  ఇచ్చినట్టు అందరు సాప్ట్ వేర్ మీద ఎడ్చే వాళ్ళే

 

16/01/2012 Posted by | జనరల్ - అబిప్రాయాలు | వ్యాఖ్యానించండి

మంచి – చెడు

కృత యుగం లో మంచి ఒక లొకం లో చెడు మరొక లొకం లో ఉండేవట…  (దేవ లొకం – రాక్షష లొకం)

త్రేతా యుగం లో మంచి సముద్రాని కి ఇవతల చెడు సముద్రాని కి అవతల ఉండేవట… (అయోద్య – లంక)

ద్వాపర యుగం లొ మంచి, చెడు పక్క పక్క నె ఉండేవట… (పాండవులు – కౌరవులు)

కలి యుగం లొ మంచి, చెడు ఒకే మనిషి లొ ఉంటయట… (మనుషులు)

ఎక్కడొ చదివా, బాగుంది కదా… 🙂

01/08/2009 Posted by | జనరల్ - అబిప్రాయాలు | 3 వ్యాఖ్యలు

మానవ సంబంధాలు

మానవ సంబంధాలు అన్ని కేవలం అవసరం మీదనే ఆధారపడి ఉన్నాయి.
నాకు తెలుసు చాలా మంది ఈ మాటను అంగీకరించరు.

ఇక్కడ అవసరం అన్న పదాన్ని సరిగా నిర్వచిద్దాము.
అవసరం అంటే కేవలం బౌతిక అవసరాలే కాదు, మానసిక అవసరాలు కూడ.
మీరు చెప్పవచ్చు, నాకు ఎటువంటి అవసరం లేని వ్యక్తులతో కూడ సంబందాలు ఉన్నాయి ఉదహరణకు స్నేహితులు, కుటుంబ సంబందాలు మొదలైనవి.
పై ఉదహరణలొ చెప్పిన వ్యక్తుల తొ మీకు మానసిక అవసరాలు లేవని చెప్పగలరా?
ఒక వ్యక్తి సన్నిహిత్యాన్ని మీరు కొరుకుంటున్నారు అంటే అక్కడ మీకు బౌతిక లేదా మానసిక అవసరాలు తీరుతున్నట్టే.
ఆ వ్యక్తి తొ కలిసి గడపటం వల్ల నేను ఆనందంగా ఉంటాను అనేది ఖచ్చితంగా మానసిక అవసరం లోకి వస్తుంది. 
మనిషికి బౌతిక అవసరాలు ఎంత ముఖ్యమో మానసిక అవసరాలు కూడ అంతే ముఖ్యం.

ఒక వ్యక్తి తన పెంపుడు జంతువు తో గడపటం వల్ల ప్రశాంతత/ఆనందాన్ని పొందుతాడు. మనుషులకు ప్రశాంతత లేదా ఆనందం అన్నవి మానసిక అవసరాల పరిది లోకి వస్తాయి.
కాబట్టి నేను చాల గట్టి గా చెప్పగలను

మానవ సంబంధాలు అన్ని కేవలం అవసరం మీదనే ఆధారపడి ఉన్నాయి.

మీ అబిప్రాయాలు  తెలియజేయండి.

03/08/2007 Posted by | నా పైత్యం | 3 వ్యాఖ్యలు

ఆనందంగా జీవించటం అంటే

ఆనందంగా జీవించటం అంటే ఆనందంగా జీవించడం అంతే…
ఆ మాత్రం చెప్పడానికి టపా ఎందుకు ?

అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది.
ఎక్కడొ చదివాను మనిషి ఆనందంగా జీవించాలంటే

కనీస మానవ అవసరాలు తీరుతూ ఉండాలి
చేయటానికి ఎదొ ఒక పని ఉండాలి,
సాధించడానికి ఎదొ ఒక లక్ష్యం ఉండాలి.

నేను ఇదేదొ బాగానే ఉందే అనుకున్నాను.

కాని పై వన్ని కలిగి ఉన్న వ్యక్తులు కూడా ఆనందంగా లేరు అంటే???
పై న చెప్పిన సిద్దాతం లో ఎదొ పొరపాటు ఉంది.

ఈ మద్యన నేను ఒక మిత్రుడుతో మాట్లాడుతున్నప్పుడు ఇదే సంభాషణ వచ్చింది.
నీవు జీవితాన్ని పూర్తిగా ఆనందిస్తున్నావా అని నేను అడిగాను, తను వెంటనే  లేదు  మరి నువ్వు అని అన్నాడు. నేను బాగానే ఆనందిస్తున్నాను అన్నాను. నీకు ఇళ్లు కోనాలని ఉంది అని చెప్పావు కదా అన్నాడు. అవును అని చెప్పాను. మరి ఇప్పుడు ఆనందంగా బతుకుతున్నాను అని అంటావేంటి?
నేను మళ్లి ఆలోచనలలో పడ్డాను. మళ్లి తనే చెప్పాడు నీ విషయం వదిలేయ్యి. కొరికలు తీరని వారు, లక్ష్యాలను సాదించలేని వారు ఆనందంగా ఏల జీవిస్తారు అన్నాడు. వారి ఆనందం వారి విజయాలలోనే ఉంది కదా అన్నాడు అప్పటికి నా వద్ద ఎమి సమాధానం లేదు. చర్చ  అక్కడితో ముగిసింది కాని నాలో నడుస్తూనే ఉంది.

నాకు ఎంత ఆలొచించిన కూడ మన లక్ష్యానికి  మన ఆనందానికి సంబంధం ఎంటో ఆర్థం కాలేదు.
పోని ఈ రెండింటికి ఎదైన లింక్ ఉంటే
ఆనందంగా జీవిస్తూ ఉన్న వ్యక్తు లు కింది వర్గాలలో ఉండాలి

1) వారి లక్ష్యాలను సాధించి, ఇంకా ఎటువంటి లక్ష్యాలు లేక విశ్రాంతి తీసుకుంటున్నవారు 
2) ఎలాగూ లక్ష్యాన్ని సాధించలేమని వదిలేసిన వారు

పై వర్గాల మధ్య పెద్ద తేడా ఎమి లేదు (ఇద్దరికి ఎమి లక్ష్యం లేదు)   కాబట్టి  లక్ష్యం లేని వారు మాత్రమే ఆనందంగా జీవిస్తారని అనుకుంటే 100% తప్పు.
ఇంకొ వర్గం కూడ ఉంది, ఈ లక్ష్యాలు చింతకాయలు ఎంట్రా బాబు, జీవితం ఏలా పొతే అలానే వెలదాం అనుకునే వారు  వీరు జీవితంలో ఎటు వెళతారో వదిలేస్తే వీరు జీవితాన్ని బాగానే ఆనందిస్తారు (కనీసం అలా అనుకుంటారు).

మొత్తానికి నాకు మాత్రం లక్ష్యానికి ఆనందంగా జీవించదానికి ఎమి సంబందం లేదు అనిపించింది.

ప్రతి రొజు ని ఆనందించండి..
మనం ప్రతి రొజు ఆఫీస్ కు ఎందుకు వెలుతున్నాము? జ్ణ్గాన పరిశోధన కోసం,దేశ సేవ కోసం మాత్రమే (కేవలం వీటి కోసమే వెళ్లే వారు)వెళ్లే వారిని వదిలెయ్యండి. డబ్బులు కూడ ఒక ముఖ్య కారణం కదా. డబ్బులు దేనికి? ఇలా ప్రశ్నిస్తూ పోతే అన్ని చేసేది ఆనందంగా ఉండటం కోసం అని వస్తుంది.(మీకు వేరే సమాధానం దొరికితే నాకు కూడ చెప్పండి)

కాబట్టి రేపు ఆనందంగా ఉండటం కొసం (ఉద్యొగం ద్వారా), ఈ రొజు ఆనందంగా ఉండటం మరిచిపోకండి.

ఎక్కడొ మొదలుపెట్టి  ఏంటొ చెప్పి ఎక్కడొ ఆపాడు అని అనిపిస్తే, ఒక సారి నవ్వుకొని ఈ టపా ను పక్కన పెట్టేయండి.  

Note : పైన రాసిందంతా కేవలం నా పైత్యం మాత్రమే, నిజాల శాతం తెలియదు, రిఫరెన్సులు ఎమి లేవు.

30/06/2007 Posted by | నా పైత్యం | 6 వ్యాఖ్యలు

ఎంటో మరీ

నాకు కొన్ని విషయాలు ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది.

“దొంగతనం చేయరాదు”  ఈ సూక్తి దాదాపు అన్ని మతాలు చెప్తాయి. దొంగతనం తప్పు అని కూడ చెప్తాయి. సరే ఒక ఉదహరణ తీసుకుందాం.

ఒక చిన్న పిల్లవాడు ఒంటరి వాడు, విపరీతమైన ఆకలి తో బాధ పడుతున్నాడు అనుకోండి. వాడికి భొజనం దొరికే అవకాశం లేదు, కొనగలిగే స్తోమత లేదు అనుకొండి
అప్పుడు వానికి దొంగతనం చేసి కడుపు నింపుకుందాం అనే ఆలొచన వస్తే అది వాడి తప్పు కాదు.
దొంగతనం చేయకూడదు అని ఆగితే చావక తప్పదు.

జీవితాని మించిన గొప్ప దర్మం ఏం ఉంటుంది చెప్పండి? 

ఆ పిల్లవాడు దొంగతనం చేయాలా వద్దా? చేస్తే తప్పా? చేయకపోతే తప్పా?

ఎంటో మరీ!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

28/06/2007 Posted by | నా పైత్యం | 11 వ్యాఖ్యలు